జస్ట్​ 20 రోజుల్లో 16 వేల కేసులపై తీర్పులు

జస్ట్​ 20 రోజుల్లో 16 వేల కేసులపై తీర్పులు
  • రెవెన్యూ ట్రిబ్యునళ్లలో మెజారిటీ కేసుల విచారణ పూర్తి
  • తీర్పులు ఏకపక్షంగా ఉన్నాయంటున్న ఎక్స్​పర్టులు

హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ ట్రిబ్యునళ్లలో మెజారిటీ కేసుల విచారణ పూర్తయింది. రెవెన్యూ కోర్టుల్లో పెండింగ్​ కేసుల విచారణకు రెవెన్యూ ట్రిబ్యునళ్లను సర్కారు పోయిన నెలలో ఏర్పాటు చేసింది. 2020 అక్టోబర్ 29 నాటికి పెండింగ్‌లోని 16,910 కేసులను ట్రిబ్యునళ్లకు బదిలీ చేసింది. జనవరి 18 నుంచి విచారణ ప్రారంభం కాగా శనివారం నాటికి 16,040 కేసుల్లో కలెక్టర్లు తీర్పు ఇచ్చారు. మిగతా 870 కేసుల విచారణ కూడా సోమ, మంగళవారంలో పూర్తయినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాలో 1,665 కేసులు, నల్లగొండలో 1,552 , యాదాద్రి భువనగిరిలో 1402, సిద్దిపేటలో 928, వరంగల్​ అర్బన్​లో 905, జనగామలో 723 కేసుల విచారణను పూర్తి చేశారు. హైదరాబాద్​(49 కేసులు), కుమ్రంభీం ఆసిఫాబాద్ (50 కేసులు) జిల్లాల్లో అతి తక్కువ కేసులు పెండింగ్‌ లో ఉన్నాయి. ఈ తీర్పులను లీగల్​ ఎక్స్​పర్ట్స్​విమర్శిస్తున్నారు. ఇరుపక్షాలకు నోటీసులు ఇవ్వకుండానే వెలువరించిన తీర్పులు సివిల్​ కోర్టుల్లో చెల్లవని అంటున్నారు. కేవలం రికార్డుల ఆధారంగానే విచారణ ముగించారని, లాయర్లనూ అనుమతించలేదని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

క్షణాల్లో కరోనా రిజల్ట్‌‌‌‌‌‌‌‌.. వాసనతో పట్టేస్తున్న ఆర్మీ డాగ్స్

ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా వచ్చిపోయింది

V6 వెలుగు’ కథనాన్ని పిల్ గా తీసుకోండి

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎవరు..?