కలెక్టర్ నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలే

కలెక్టర్ నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలే

హైదరాబాద్‌‌, వెలుగు: కలెక్టర్, సీడబ్ల్యూసీ ఆఫీసర్ల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని జూనియర్ ఆర్టిస్ట్​కరాటే కళ్యాణి వెల్లడించారు. ఇటీవల యూట్యూబర్ శ్రీకాంత్‌‌ రెడ్డిపై దాడితో వివాదాస్పదమైన కళ్యాణి మంగళవారం అబిడ్స్​లోని చైల్డ్‌‌ వెల్ఫేర్ కమిటీ ఆఫీసుకి వచ్చారు. ఆమెతో 5 నెలల చిన్నారి తల్లిదండ్రులు ఉన్నారు. కాగా ఆఫీసులో అధికారులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్లిపోతూ మీడియాతో మాట్లాడారు. చిన్నారిని ఇల్లీగల్‌‌గా దత్తత​ చేసుకున్నానని జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చేందుకు వచ్చినట్లు తెలిపారు. చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ఓ యూట్యూబ్‌‌ చానెల్​లో వెల్లడించిన సంగతి నిజమేనని చెప్పారు. చిన్నారికి ఏడాది నిండిన తరువాత లీగల్‌‌గా దత్తత చేసుకునేందుకు పాప తల్లిదండ్రులకు ఆశ్రయం ఇచ్చానని తెలిపారు. బుధవారం చెల్డ్ ​వెల్ఫేర్​ఆఫీసర్లను కలిసి పూర్తి వివరాలు వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అంతకు ముందు హైదరాబాద్ ​కలెక్టర్​శర్మన్​ను కళ్యాణి కలిసి మాట్లాడారు.