రాష్ట్ర రెవెన్యూ శాఖలో ప్రమోషన్లలో జూనియర్ అసిస్టెంట్లకు అన్యాయం

రాష్ట్ర రెవెన్యూ శాఖలో  ప్రమోషన్లలో జూనియర్ అసిస్టెంట్లకు అన్యాయం

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న తమకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని జూనియర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. జూనియర్ అసిస్టెంట్లు పరమాత్మ గౌడ్, సుధాకర్ రెడ్డి, విజయరామరాజు, సుమన్, అజయ్ వర్మ, చంద్రమోహన్ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 

గ్రూప్–4 ద్వారా నియమితులైన తమకు ప్రమోషన్లలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. నేరుగా ఉద్యోగాల్లో చేరిన వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించి ప్రమోషన్లలో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.