స్టైఫండ్ పెంచాలి...జూనియర్ డాక్టర్ల ధర్నా

స్టైఫండ్ పెంచాలి...జూనియర్ డాక్టర్ల ధర్నా

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రుల్లో  జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఎర్రగడ్డలో జూనియర్ డాకర్లు స్టైఫండ్ పెంచాలని ఆరు రోజులుగా ధర్నా చేస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒక్కసారి స్టైఫండ్ పెంచాలనే నిబంధన  ఉందని..అయినా ప్రభుత్వం పెంచడం లేదని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం స్టైఫండ్ పెంచడం లేదని జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ధర్నా చేస్తున్నా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.