ఇవాల్టి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

ఇవాల్టి నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె

పద్మారావునగర్, వెలుగు: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జూనియర్​డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేయనున్నారు. ఔట్ పేషెంట్ల(ఓపీ) సేవలు, ఎలక్టివ్​సర్జరీలు, వార్డు డ్యూటీలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు గాంధీ జూనియర్ డాక్టర్ల యూనిట్ ​ప్రెసిడెంట్​ ఎం వంశీకృష్ణ తెలిపారు.

ఎమర్జెన్సీ, ఐసీయూలో డ్యూటీలు కొనసాగుతాయన్నారు. రెగ్యులర్​గా తమకు స్టైఫండ్ ఇవ్వాలని, ఏపీ మెడికల్ స్టూడెంట్స్​కు ఇస్తున్న15 శాతం రిజర్వేషన్లను తొలగించాలని, అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మౌలిక వసతులతో కూడిన హాస్టళ్లను నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులను తొలగించి, కొత్త భవనాలను నిర్మించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తీర్చేవరకు తమ సమ్మె కొనసాగుతుందన్నారు.