
రంగారెడ్డి జిల్లా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. చేవెళ్ళ నియోజకవర్గంలోని మొయినాబాద్ సబ్ స్టేషన్ లో పనిచేసే జూనియర్ లైన్ మెన్ లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.
వీరకర్ణ అనే వ్యక్తి నాగిరెడ్డి గూడ, బాకారం ఏరియాలో జూనియర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. అయితే బాకారం గ్రామంలో హైదరాబాద్ కు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి రెండు ఎకరాల పొలాన్ని తీసుకున్నాడు. ఆ పొలంలో మీటర్ బిగించడానికి ప్రతాప్ వీరకర్ణకు రూ. 10 వేలు లంచం ఇస్తానని ఒప్పుకున్నాడు.
మీటర్ బిగించే సమయంలో మరో 5 వేలు ఇవ్వాలని వీరకర్ణ డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మరో రూ. 5 వేలు ఇచ్చాడు. అయితే రూ. 10 వేలు ఇచ్చిన తర్వాత కూడా వీర కర్ణ మరిన్ని డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తోపాటు తమ సిబ్బంది ఆధ్వర్యంలో వీరకర్ణ లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. జూనియర్ లైన్ మెన్ పై కేసు నమోదు చేశారు.