బాలయ్య బర్త్ డే మర్చిపోయాడా? లేక కావాలనే.!

బాలయ్య బర్త్ డే మర్చిపోయాడా? లేక కావాలనే.!

బాబాయ్ బర్త్ డే అబ్బాయి మర్చిపోయాడా? లేక కావాలనే విష్ చేయలేదా? ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్. జూన్ 10 నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం బాలయ్యకు విషెష్ చెప్పలేదు. దీంతో, కావాలనే ఎన్టీఆర్ బాలయ్యకు విషెష్ చెప్పలేదా లేక మర్చిపోయాడా అనే చర్చ మొదలైంది. గతంలో చాలా సార్లు ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణకి శుభాకాంక్షలు తెలియజేశాడు. కానీ ఇప్పుడు చేయకపోవడంపై ఇటు ఇండస్ట్రీ పరంగా గానీ, అటు రాజకీయ పరంగా గానీ చర్చనీయాంశం అయ్యింది. 

ఇక కళ్యాణ్ రామ్(Kalyan ram) ఒక్కడు మాత్రం భగవంత్ కేసరి(Bhagavanth Kesari) టీజర్ బాగుంది, పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్-బాలయ్య ఫ్యాన్స్ మధ్య కొంత గ్యాప్ వచ్చింది అనే వార్తలకు బలం చేకూరింది.