సమ్మె విరమించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

సమ్మె విరమించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు

తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలంటూ 16 రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు వెనక్కి తగ్గారు. . తొర్రూర్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో చర్చలు జరపగా సమ్మె విరమిస్తున్నట్లు వారు ఆయనకు లేఖ సమర్పించారు. మంత్రి ఎర్రబెల్లి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమిస్తున్నట్లు  జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎలికట్టే శ్రీకాంత్ గౌడ్ చెప్పారు. ఎవరి బలవంతంతోనూ సమ్మె విరమించడం లేదన్నారు. 

జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సమ్మెకు పిలిచేది లేదని మే 12న  సీఎస్ శాంతకుమారి స్పష్టం చేశారు. మే 13 మధ్యాహ్నం 12 గంటల లోపు విధుల్లో చేరాలని లేకపోతే ప్రభుత్వంతో వారికి ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించారు. 

జేపీఎస్ లు సమ్మె విరమించి విధుల్లో చేరొచ్చని.. విధులకు హాజరుకాని వారి స్థానంలో  తాత్కాలిక కార్యదర్శులను నియమించాలని సూచించారు. గతంలో జేపీఎస్ పరీక్ష రాసిన వారికి ఈ ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  లేదా రిజర్వేషన్ల ప్రతిపాదికన విధుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లితో చర్చలు జరిపిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.