ఏం చేసుకుంటారో చేసుకోండి... తగ్గేదేలా అంటున్న కార్యదర్శులు

ఏం చేసుకుంటారో చేసుకోండి... తగ్గేదేలా అంటున్న కార్యదర్శులు

రాష్ట్ర ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకునేందుకు జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సిద్దమయ్యారు. మే 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా సమ్మె విరమించాలని.. విధుల్లో చేరాలంటూ కేసీఆర్ ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. లేకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం. మే 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సమ్మె విరమించలేదు. విధుల్లో చేరలేదు. ఉద్యోగం నుంచి తొలగిస్తామన్న బెదిరింపులకు సైతం లెక్కచేయకుండా సమ్మె కొనసాగిస్తనునారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితిల్లోనూ.. సమ్మె విరమించేది లేదని జూనియర్ పంచాయితీ కార్యదర్శులు స్పష్టం చేస్తున్నారు.

జూనియర్ పంచాయితీ కార్యదర్శుల డిమాండ్లు..

>>> జూనియర్ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేస్తూ జీవో విడుదల చేయాలి.
>>>  గడిచిన నాలుగు సంవత్సరాల ప్రొబెషనరీ  కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలి. 
>>> ప్రస్తుతం పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను అందరినీ JPSలుగా ప్రమోట్ చేస్తూ.. పని చేసిన కాలాన్ని ప్రొబెషనరీ పిరియడ్లో భాగంగా పరిగణించాలి. వారిని కూడా రెగ్యూలర్ చేయాలి.
>>>  రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ ను నిర్ధారించి ప్రకటించాలి