మీ సాయాన్ని మరువం.. భారత్‌‌ను ఆదుకుంటాం

మీ సాయాన్ని మరువం.. భారత్‌‌ను ఆదుకుంటాం

వాషింగ్టన్: కరోనాతో విలవిల్లాడుతున్న భారత్‌‌కు అన్ని విధాలుగా సాయం అందిస్తామని యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇండియాకు సాయంగా లైఫ్ సేవింగ్ మెడికల్ ఎక్విప్‌‌మెంట్స్‌‌‌ను కూడా పంపిస్తామని యూఎస్ స్పష్టం చేసింది. కరోనా తొలి వేవ్ సమయంలో అమెరికాలోని ఆస్పత్రులకు కావాల్సిన సాయాన్ని ఇండియా అందించినందున.. భారత్ ఎప్పుడు ఆపదలో ఉన్నా తాము ఆదుకుంటామని బైడెన్ ట్వీట్ చేశారు. 

కరోనా కష్టకాలంలో భారత్‌‌కు సాయపడేందుకు కేంద్ర ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నామని కమలా హ్యారిస్ ట్వీట్ చేశారు. ఇండియాకు కావాల్సిన అదనపు సహాయ సహకారాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. భారత ప్రజలు, వీరోచిత హెల్త్‌‌కేర్ వర్కర్లు క్షేమం కోసం తాము ప్రార్థనలు చేస్తామన్నారు.