108 అంబులెన్స్‌లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి

108 అంబులెన్స్‌లో సరైన వైద్యం అందక.. పసికందు మృతి

హైదరాబాద్: మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్ లో పసికందును తరలిస్తుండగా.. సరైన వైద్యం అందక వెళ్తున్న అంబులెన్స్ లోనే పసికందు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీ కిషన్ గూడ వద్ద అంబులెన్స్ లో జరిగిన ఘటన పసికందు కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మహబూబ్ నగర్ కు చెందిన లక్ష్మి అనే మహిళ వారం రోజుల క్రితం మహబూబ్ నగర్ ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన బిడ్డ శ్వాసకోస వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రికి తరలించాలని అక్కడి డాక్టర్లు  సూచించారు. దీంతో పసికందును తీసుకుని తన కుటుంబ సభ్యుల సహాయంతో 108 అంబులెన్స్ లో హైదరాబాద్ కు బయలుదేరి శంషాబాద్ వద్దకు రాగానే పసికందు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై విలపించారు. 108 అంబులెన్స్‌లో కూర్చోవడానికి సదుపాయలు కూడా సరిగా లేకపోవడంతో పాటు ప్రాథమిక చికిత్స అందించేందుకు కూడా అంబులెన్స్‌లో ఎలాంటి సదుపాయం లేకపోవడంతో తమ బిడ్డ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని కన్నతల్లి లక్ష్మి కంట తడిపెట్టుకుని విలపించింది. తాము కూర్చునేందుకు కూడా అంబులెన్స్ లో సరైన జాగా లేదని.. అలాగే బిడ్డకు పెట్టేందుకు అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకపోవడంతో అలాగే అంబులెన్స్‌లో బయలుదేరి వచ్చామని.. అంబులెన్స్‌లో పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని సరిగ్గా కూర్చోవడానికి వీలు లేకపోవడంతో.. కుదుపులకు లోనుకావడంతో ఒత్తిడి పెరిగి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

For More News..

మంత్రి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఎన్నికల కమిషనర్ ఆదేశం

వీడియో: అది యాక్సిడెంట్ కాదు.. సూసైడ్.. పరిగెత్తుకెళ్లి లారీ కిందపడిన వ్యక్తి

యూట్యూబ్ లైవ్‌లో ఛాలెంజ్.. 1.5 లీటర్ వోడ్కా తాగి చనిపోయిన వ్యక్తి