
తన కస్టమర్ల ఇంటి గడప దగ్గరికే ఏటీఎంను తీసుకొచ్చే కొత్త రకం సేవలను స్టేట్ బ్యాంక్ మొదలు పెట్టింది. కరోనా కారణంగా చాలా మంది ఏటీఎం సెంటరకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. దీంతో ఇంటికే డబ్బు తెచ్చి ఇచ్చేందుకు ‘డోర్ స్టెప్ ఏటీఎం’ సేవలను షురూ చేసింది. ఇక నుంచి స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు తమ చిరునామా వివరాలను 7052911911 లేదా 7760529264 నంబర్లకు వాట్సప్ ద్వారా మెసేజ్‌పంపినా, కాల్‌చేసినా ఇంటి దగ్గరికే డబ్బు వస్తుంది. ప్రస్తుతం లక్నోలో మాత్రమే ఈ సేవలు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ సీజీఎం అజయ్ కుమార్ ఖన్నా మాట్లాడుతూ ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సేవలు సక్సెస్ అయితే మరిన్ని సిటీలకు అందిస్తామని వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ చాలా ఏళ్ల నుంచి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తోంది. సీనియర్ సిటిజన్ల కోసం క్యాష్‌పి కప్, క్యాష్ డెలివరీ, చెక్‌పికప్, ఫామ్ 15హెచ్ పికప్, లైఫ్ సర్టిఫిర్టి కెట్ పికప్, కేవైసీ డాక్యుమెంట్ పికప్ వంటి సర్వీసులు అందిజేస్తున్నది. తమ హోంబ్రాంచ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలోపు ఉండే ముసలి వాళ్లు మాత్రమే ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి కూడా స్టేట్ బ్యాంక్ ఇటీవల టోల్‌ఫ్రీ నంబరు 9223766666ను మొదలుపెట్టింది.