హరగోపాల్ పై కేసు విత్ డ్రా చేసుకోవాలె.. లేకపోతే ఉద్యమిస్తాం: చంద్రకుమార్

హరగోపాల్ పై కేసు విత్ డ్రా చేసుకోవాలె.. లేకపోతే ఉద్యమిస్తాం: చంద్రకుమార్

ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయడాన్ని  జస్టిస్ బి. చంద్రకుమార్ ఖండించారు. చదువుకున్న మేధావులు, అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్లపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. ఫ్రొఫెసర్ హరగోపాల్ పై నమోదు చేసిన దేశద్రోహం కేసును వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు.  ఫ్రొఫెసర్ కేశవ రావు జాదవ్ సంస్మరణ సభలో మాట్లాడిన ఆయన..  ప్రభుత్వాలు వాక్ స్వాతంత్ర్యాన్ని  నొక్కాలనే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.  ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వాళ్లకు మద్దతివ్వాల్సిన అవసరం ఉందన్నారు.  ఏదో వయసయిపోయిందని....చేతులు ముడుచుకుని కూర్చోవాల్సిన అవసరం లేదన్నారు. గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని.. అందరం ఏకమై పోరాడాలన్నారు. 

ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశ ద్రోహం కేసు నమోదయింది. 2002 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పీఎస్ లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు.  యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్ తో పాటు మరో 10 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హరగోపాల్ తో పాటు మరో 152 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరుందని కేసు నమోదు చేశారు. ప్రజాప్రతినిధులపై దాడికి కుట్ర చేశారని ఆరోపించారు. పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్ మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా పోలీసులు ఈ  కేసు వివరాలు బయటపెట్టారు.

తనపై దేశ ద్రోహం కేసు నమోదు చేయడాన్ని తప్పుబట్టారు హరగొపాల్.  దేశ ద్రోహం,రాజద్రోహం కేసులు పెట్టొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. తనపై పెట్టిన దేశ ద్రోహం కేసు చెల్లదన్నారు. మావోయిస్టు పుస్తకాల్లో పేరు వచ్చినంత మాత్రానే కేసు నమోదు చేస్తే ఎలా అని ప్రశ్నించారు.