ప్రతీకారం తీర్చుకోవడం.. ‘న్యాయం’ కాదు: సుప్రీం చీఫ్ జస్టిస్

ప్రతీకారం తీర్చుకోవడం.. ‘న్యాయం’ కాదు: సుప్రీం చీఫ్ జస్టిస్

న్యాయమనేది ఇన్‌స్టెంట్‌గా జరగడం కుదరదని అన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బోబ్డే. ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయమన్న భావనకు వస్తే.. జస్టిస్ అనేది దాని స్వరూపాన్ని, అర్థాన్ని కోల్పోతుందని అన్నారాయన. శనివారం రాజస్థాన్‌లో హైకోర్టు కొత్త బిల్డింగ్ ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పోలీసులు దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో సీజేఐ ఈ కామెంట్స్ చేయడం సంచలనం కలిగిస్తోంది. అయితే ఆయన ఈ ఘటనను ప్రస్తావించలేదు.

అయితే ‘ఇటీవల జరుగుతున్న ఘటనలతో న్యాయం వేగంగా జరగాలని, న్యాయవ్యవస్థ మారాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కచ్చితంగా న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలి. విచారణ ఆలస్యం తగదు. కానీ, ఇన్‌స్టెంట్‌ జస్టిస్ అనేది ఎప్పటికీ సాధ్యం కాధు. జస్టిస్ అనే ఎప్పటికీ ప్రతీకారంగా మారకూడదు. అలా జరిగితే జస్టిస్ అనేది దాని స్వరూపాన్ని కోల్పోయినట్లే’ అని అన్నారు సీజేఐ.

MORE NEWS:

ఉన్నావ్ రేప్ బాధితురాలు మంటల్లో కాలుతూ.. సాయం కోసం కిలోమీటరు పరుగు

మానవ హక్కుల కమిషన్‌కు సమాధానం చెబుతాం: సజ్జనార్

కేసుల విచారణ వేగవంతం చేయడం గురించి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో కొత్త టెక్నాలజీల అవసరం ఉందన్నారు జస్టిస్ బోబ్డే. మీడియేషన్ వంటి విధానాల ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేలా మార్పులు జరగాలన్నారు.

ప్రజలకు న్యాయం అందుబాటులోకి వచ్చేలా ఉన్న వ్యవస్థల్ని పటిష్టం చేయాలని సీజేఐ చెప్పారు. న్యాయం కాస్ట్లీగా మారకూడదని, కేసులను త్వరగా పరిష్కరించేందుకు.. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కొత్త మార్గాలను చూడాలని అన్నారు.  న్యాయ వ్యవస్థలో ఆలస్యం వల్ల నిరాశ, నిస్పృహతో ప్రజలకు నమ్మకం పోతుందని అన్నారు.