కేసీఆర్​ పాలనలో న్యాయం జరగలే: కర్నాటక మంత్రి జమీర్​ అహ్మద్​

కేసీఆర్​ పాలనలో న్యాయం జరగలే: కర్నాటక మంత్రి జమీర్​ అహ్మద్​

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణలో మైనారిటీలను బీఆర్​ఎస్​ కేవలం ఓట్ల కోసం మాత్రమే వాడుకుంటున్నదని కర్నాటక మంత్రి జమీర్​ అహ్మద్​ విమర్శించారు. శనివారం ఆయన కాంగ్రెస్​ రాష్ట్ర కమ్యూనికేషన్స్​ ఇన్​చార్జి అజయ్​ ఘోష్​తో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​ పార్టీ మైనారిటీ డిక్లరేషన్​ ప్రకటించడంతో బీఆర్​ఎస్​కు భయం పట్టుకుందన్నారు.

రాష్ట్రంలో 77 వేల ఎకరాల వక్ఫ్​ భూములుంటే, 54 వేల ఎకరాలు కబ్జా అయ్యాయని ధ్వజమెత్తారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని 2014లో ప్రకటించిన కేసీఆర్​.. ఇప్పటి వరకు ఆ బిల్లును కూడా ఆమోదించలేదని దుయ్యబట్టారు. జామా మసీదు మరమ్మతుల కోసం రూ.2.30 కోట్లు కేటాయించిన కేసీఆర్​ సర్కారు.. అందులో కేవలం రూ.2 లక్షలే విడుదల చేసిందని మండిపడ్డారు.