
ఆసియా క్రీడలు 2023లో ఆదివారం జరిగిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో భారత క్రీడాకారిణి జ్యోతి యర్రాజీ రజతం కైవసం చేసుకుంది. ఫాల్స్ స్టార్ట్ వివాదం తరువాత జ్యోతి యర్రాజీ విజేతగా ప్రకటించారు. చైనీస్ రన్నర్ వు యాన్నీ లేన్ ఫోర్‌లో తప్పుగా ప్రారంభించింది. అయితే ఆమె పరుగును కొనసాగించారు అధికారులు. అధికారులు ఫుటేజీని మళ్లీ తనిఖీ చేసి వాస్తవానికి యన్ని దోషి అని నిర్ణయించారు. యన్నీ (12.91 సెకన్లు) టైమింగ్‌తో రెండవ స్థానంలో నిలిచింది. రిప్లైల తర్వాత ఆమె స్థానంలో జ్యోతి యర్రాజి (13.04) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన లిన్ యువే (12.74) మొదటి స్థానంలో నిలిచింది.