టాలీవుడ్, కోలీవుడ్ లో పదికి పైగా హీరో హీరోయిన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న వారున్నారు. అందులో ఒక చక్కని జంట ఎవరంటే..టక్కున గుర్తొచ్చేది..సూర్య (Suriya)..జ్యోతిక (Jyothika) అనే చెప్పుకోవాలి. వీరిద్దరూ నటనలోనూ, ఆహ్యార్యంలోను, సామాజిక సేవ దృక్పథంలోనూ ప్రతిఒక్కరికి ఆదర్శంగా నిలిచారు.
ఇవాళ బుధవారం (సెప్టెంబర్ 11న) ఈ బ్యూటిఫుల్ కపుల్..18వ పెళ్లిరోజు కావడంతో సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీ నుంచి తమ ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంట గురించి కొన్ని విశేషాలు తమ ఫ్యాన్స్ కోసం..చదివేయండి.
1999లో విడుదలైన ‘పూవెల్లామ్ కేట్టుప్పార్’లో తొలిసారి ఈ జంట కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ వరుసగా ఏడు సినిమాల్లో కలిసి నటించేలా సినీ జర్నీ సాగింది. ఇక సూర్య, జ్యోతికల పరిచయం ప్రేమగా మారడంతో.. 2006లో పెళ్లి చేసుకున్నారు.ఈ జంటకు ఇద్దరు పిల్లలు.
Also Read :- షారుక్ ఖాన్ కాళ్లు మొక్కిన హీరో రానా
వీరి మధ్య చిగురించిన లవ్ స్టోరీ..ఆ తర్వాత పెళ్లి, పిల్లలు, తిరిగి సినిమా సెకండ్ ఇన్నింగ్ వంటి విశేషాలు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటాయి. ఎందుకంటే వీరంటే..తెలుగు కోలీవుడ్ ఫ్యాన్స్ కు అమితమైన ఇష్టం. వీరి సినిమాలు చూసిన, వీరు కలిసున్న ఫొటోస్ చూసిన ఫ్యాన్స్ వెంటనే కామెంట్స్ చేస్తూ..ఆ ఫోటోలను షేర్ చేస్తుంటారు. అయితే, ఈ బ్యూటిఫుల్ జోడీని ఒకే ఫ్రేమ్ లో చూడాలని తమ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం..వీరిద్దరూ జోడిగా కనిపిస్తున్నట్లు సమాచారం. బ్లాక్ బాస్టర్ బెంగుళూరు డేస్ ఫేమ్ అంజలి మేనన్ డైరెక్షన్ లో సూర్య, జ్యోతికలు కలిసి ఓ మూవీ చేయనున్నారట. ప్రస్తుతం ఈ జోడీని స్క్రీన్ పై చూపించడానికి మేకర్స్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ అందమైన జంట కాంబోపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదే కనుక నిజమైతే దాదాపు 18 ఏళ్ల తరువాత సూర్య, జ్యోతిక మరోసారి వెండితెరపై.. కలిసి ప్రేమ పాఠాన్ని అభిమానులకి చెప్పే సమయం అతి దగ్గర్లోనే ఉంది.
Also Read :- బిల్డింగ్ పైనుంచి దూకి..నటి తండ్రి ఆత్మహత్య
ప్రస్తుతం వీరిద్దరి సినిమాల విషయానికి వస్తే..జ్యోతిక రీసెంట్ గా అజయ్ దేవగన్ తో నటించిన షైతాన్, మలయాళ స్టార్ మమ్ముట్టి తో కాదల్ ది కోర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ అందుకున్నాయి. అలాగే కొన్ని సినిమాల్లో నటిస్తూనే..మంచి కంటెంట్ ఉన్న సినిమాలని నిర్మిస్తోంది.
సూర్య ప్రస్తుతం కంగువ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. అలాగే రీసెంట్ రైటర్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో సూర్య 44వ చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
Congratulating @Suriya_offl & #Jyotika on their 18th Wedding Anniversary 💞
— Studio Green (@StudioGreen2) September 11, 2024
It's been 18 years, but their magic & fragrance of #SillunuOruKaadhal keeps inspiring zillions!
From Team #StudioGreen #KEGnanavelraja#HappyWeddingAnniversarySuJo #18YearsOfSillunuOruKaadhal pic.twitter.com/LgaLJ8ARPT