టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) మంగళవారం (సెప్టెంబర్ 10) ముంబైలో జరిగిన ఐఫా 2024 (IIFA 2024) ప్రీ ఈవెంట్లో పాల్గొన్నారు.ఈ స్పెషల్ ఈవెంట్లో బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) కాళ్లను మొక్కి రానా టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఇక ఆ వెంటనే రానా చేసిన పనికి షారుక్ ఖాన్ నవ్వుతూ..అతన్ని హాగ్ చేసుకున్నాడు. రానా కాళ్లు మొక్కే సమయంలో అక్కడున్న ఆడియన్స్ పెద్ద ఎత్తున హర్షధ్వానాలతో అతడికి స్వాగతించారు.
అంతేకాకుండా అక్కడ పక్కనే ఉన్న డైరెక్టర్ కరణ్ జోహార్ కాళ్లు కూడా మొక్కాడు రానా. ఇక రానా ఇలా చేయడం గురించి అక్కడున్న వారంతా చర్చించుకుంటుండగానే..మేమంతా సౌతిండియన్స్. అందుకే ఇలా చేస్తామంటూ రిప్లై ఇచ్చాడు రానా.
రానా..ఎందుకలా చేశాడంటే?
ఈ ఈవెంట్ లో షారుక్ తోపాటు హీరో రానా, డైరెక్టర్ కరణ్ జోహార్, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీలాంటి సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు.అయితే, ప్రసెంట్ జనరేషన్ వాళ్లు..పెద్దవాళ్ల కాళ్లు ఎలా మొక్కుతారో చెబుతూ..ముందు షారుక్ ఖాన్ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశాడు.
పక్కనే ఉన్న కరణ్ జోహార్ కాలిని తన కాలితో టచ్ చేసి..ఆ తర్వాత తన కాలినే వాళ్లు మొక్కుతారంటూ హీరో షారుక్ ఖాన్ అలా చేసి చూపించాడు. దీంతో ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన రానా..మొదట షారుక్ ను హగ్ చేసుకుని కాళ్లు మొక్కాడు. ఆ తర్వాత తాను పూర్తిగా సౌత్ ఇండియన్ అని..కాళ్లు తాము ఇలా మొక్కుతామంటూ షారుక్, కరణ్ జోహార్ కాళ్లు మొక్కి చూపించడంతో ఆ ఈవెంట్ దద్దరిల్లింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో రానా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఈ వీడియో చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ భిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
నెటిజన్స్ రియాక్షన్:
"సౌత్ ఇండియన్స్ సంస్కృతి చాలా బాగుంటుంది" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "హ.. హ.. హ.. సూపర్ క్యూట్" అని మరొకరు స్పందించారు. షారుక్ అంటే అందరూ ఇష్టపడతారని, తాజాగా రానా ఇలా చేయడం అందుకు నిదర్శనమని ఇంకో అభిమాని కామెంట్ చేశారు.
2024 ఐఫా అవార్డ్స్:
కాగా ఈ ఐఫా అవార్డ్స్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 27 నుంచి 29 వరకు యూఏఈలోని అబుదాబి యస్ ఐలాండ్‌లో నిర్వహించనున్నారు. అవార్డ్స్ ఈవెంట్‌లో ఉత్తమ మలయాళం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ సినిమాలు సందడి చేయనున్నాయి. ఇందులో షారుక్ ఖాన్ తోపాటు కరణ్ జోహార్, రానా, సిద్దాంత్ చతుర్వేది, అభిషేక్ బెనర్జీ లాంటి వాళ్లు హోస్ట్ చేయనున్నారు. ఇక సీనియర్ నటి రేఖతోపాటు షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ లాంటి వాళ్లు పర్ఫార్మ్ చేయబోతున్నారు.
#IIFA2024 is coming soon!
— IIFA (@IIFA) January 29, 2024
Calling out to all the producers, production houses, and studios to gear up and send in their entries for IIFA 2024.
Don’t miss out and send in the entries now!#IIFA #Bollywood #Awards #NowOpen pic.twitter.com/Jo3SD9XKYU