చేవెళ్ల బీజేపీ ఎంపీ టికెట్ రేసులో కె.కృష్ణసాగర్ రావు

చేవెళ్ల బీజేపీ ఎంపీ టికెట్ రేసులో కె.కృష్ణసాగర్ రావు

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలోనే చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఆ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావు. ఈ మేరకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ లను కలిసి కోరారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. 13 ఏళ్లుగా బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నానని.. పార్టీ ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినట్లు చెబుతూనే.. రాబోయే ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు కృష్ణసాగర్ రావు.

చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని.. పార్టీ నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ.. ప్రజాదరణతో విజయం సాధించగలనని విశ్వాసం వ్యక్తం చేశారు కె.కృష్ణసాగర్ రావు. పార్టీ టికెట్ కేటాయించినట్లయితే.. శక్తి వంచన లేకుండా పోరాటం చేసి.. ప్రజల మద్దతుతో గెలుస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారాయన. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లకు వివరిస్తూ.. పార్టీ టికెట్ కోరుతూ వినతిపత్రం ఇచ్చారాయన.

పార్టీ టికెట్ కేటాయింపు విషయంలో అనేక అంశాలను పార్టీ పరిశీలిస్తుందని.. అందుకు సంబంధించిన అన్ని అర్హతలు ఉన్నాయని  వెల్లడించారు కృష్ణసాగర్ రావు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం పార్టీ కల్పిస్తుందన్న విశ్వాసం ఉందన్న ఆయన.. నియోజకవర్గం పరిధిలో చేసిన ప్రజా పోరాటాలు, 13 ఏళ్లుగా బీజేపీ పార్టీ కోసం చేసిన కృషిని వివరిస్తూ.. టికెట్ ఆశిస్తున్నట్లు వివరించారు కృష్ణసాగర్ రావు. ఈ విషయాలను ఎంపీ, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్ దృష్టికి కూడా తీసుకెళ్లారాయన.