
కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. సుజీత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ సినిమా దీపావళికి విడుదలై థియేటర్స్‌లో సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తాజాగా ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ.. అతి తక్కువ టైమ్‌లో 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ దక్కించుకుంది. ఈ సందర్భంగా బ్లాక్ బస్టర్ ధమా‘క’ పేరుతో శనివారం ఈవెంట్‌ను నిర్వహించారు. కిరణ్ మాట్లాడుతూ ‘మంచి సినిమా చేస్తే ప్రేక్షకుల ప్రేమను గెల్చుకోవచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని ‘క’ సినిమా ఇచ్చింది.
పైరసీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరి ఇంటికి ఈ సినిమాను చేర్చిన ఈటీవీ విన్ టీమ్‌కి థ్యాంక్స్’ అని చెప్పాడు. థియేటర్స్‌లో వచ్చిన వండర్‌ఫుల్ రెస్పాన్స్ ఓటీటీలోనూ రావడం ఆనందంగా ఉందని, డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో ఆడియెన్స్‌కు మరింత సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందని దర్శకులు చెప్పారు. మూవీ టీమ్‌తో పాటు ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ పాల్గొన్నారు.