
ఖైరతాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ. పాల్ ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ కోరుతూ న్యాయస్థానంలో కేసు వేసినట్టు తెలిపారు. సోమవారం ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. మేఘా కృష్ణారెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్ల పేరుతో వందల కోట్లు విరాళాలు ఇచ్చారని విమర్శించారు.
ఆయనపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపిస్తామని అన్నారని గుర్తు చేశారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా ఇంత వరకు చర్యలు లేవన్నారు.