బెట్టింగ్ యాప్ బాధితులకు న్యాయం జరగడం లేదు : కేఏ పాల్

బెట్టింగ్ యాప్ బాధితులకు న్యాయం జరగడం లేదు : కేఏ పాల్
  • ఈ యాప్‌‌లతో పలు ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయ్‌‌: కేఏ పాల్

న్యూఢిల్లీ, వెలుగు: బెట్టింగ్ యాప్‌‌ల బాధితులకు న్యాయం జరగడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు. ఈ యాప్‌‌ల కారణంగా తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు తమ వారిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్‌‌ యాప్‌‌లపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

 శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. బెట్టింగ్ యాప్‌‌లకు పెద్దపెద్ద ప్రముఖులు, సినీ హీరోలు ప్రచారం చేశారని, వారి మాటలు విని చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని మండిపడ్డారు. ఇంత ముఖ్యమైన కేసు పలుమార్లు వాయిదా పడడం తనను బాధించిందన్నారు.