కేసీఆర్ పాలనలో రాష్ట్రం అఘాయిత్యాలకు అడ్డాగా మారింది : కేఏ పాల్

 కేసీఆర్ పాలనలో రాష్ట్రం అఘాయిత్యాలకు అడ్డాగా మారింది : కేఏ పాల్

కేసీఆర్ పాలనలో రాష్ట్రం అఘాయిత్యాలకు అడ్డాగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.  వికరాబాద్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన శిరీష కుటుంబ సభ్యులను ఆయన పరమార్శించారు. అధికారం రాకముందు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కనుగుడ్లు పీకేస్తానన్న కేసీఆర్..  ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు జరిగితే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.  

కేసీఆర్ డబ్బులు తీసుకొని హత్యలను ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.  న్యాయవాదులు కూడా డబ్బులకు ఆశపడి నిందితులను కాపాడుతున్నారని చెప్పారు.  పోలీసులు సరైన దర్యాప్తు చేయాలన్న పాల్..  భాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.  తనకు పార్లమెంట్ లో అవకాశం కల్పిస్తే..  మహిళల భద్రత కోసం ప్రత్యేక బిల్లు ప్రవేశ పెడతానని చెప్పారు. సీఎంగా అవకాశం ఇస్తే కొత్త చట్టాలు తెచ్చి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలా ఉండాలో చూపిస్తానని అన్నారు.