సూపర్​మ్యాక్స్​ కార్మికులను కేసీఆర్ ​ఆదుకోవాలి : కేఏ పాల్​

సూపర్​మ్యాక్స్​ కార్మికులను కేసీఆర్ ​ఆదుకోవాలి : కేఏ పాల్​

జీడిమెట్ల, వెలుగు: సీఎం కేసీఆర్​ కార్మికుల శ్రేయస్సు కోరేవాడైతే  సూపర్​మ్యాక్స్​ కార్మికులను ఆదుకోవాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్​ కేఏ పాల్​డిమాండ్​ చేశారు. సీఎం ఒక్క ఫోన్​ కాల్​తో కంపెనీ ఓపెన్​ చేయించి  కార్మికులను ఆదుకోవచ్చన్నారు. కేసీఆర్​ సర్కార్​ స్పందించకపోతే జీడిమెట్ల ఇండస్ట్రియల్​ ఏరియాలోని  సూపర్​మ్యాక్స్​ కంపెనీని వారం రోజుల్లో తెరిపిస్తానని కేఏ పాల్​ చెప్పారు. కాగా, సుమారు వెయ్యిమంది సూపర్​మ్యాక్స్​ కార్మికులు  కొన్ని నెలలుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. వారికి ఆయన శనివారం సంఘీభావం తెలిపారు. అనంతరం పాల్​ మాట్లాడుతూ కంపెనీ అర్ధంతరంగా వెయ్యిమంది కార్మికులను తొలగిస్తే వారి కుటుంబాలు ఏమవుతాయని  ప్రశ్నించారు. కార్మికులు తమ ఇంటి అద్దెలు, వాహనాల ఈఎంఐలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.   తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో కంపెనీ మూత పడుతున్నా కేసీఆర్​ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.