Bhagyashri Borse: దుల్కర్ సల్మాన్ చెంప పగలగొట్టిన హీరోయిన్.. 'కాంత' సెట్స్‌లో భాగ్యశ్రీ బోర్సేకు ఎదురైన కష్టాలు!

Bhagyashri Borse: దుల్కర్ సల్మాన్ చెంప పగలగొట్టిన హీరోయిన్.. 'కాంత' సెట్స్‌లో భాగ్యశ్రీ బోర్సేకు ఎదురైన కష్టాలు!

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా కలిసి నటించిన చిత్రం ' కాంత '.  భారీ అంచనాలతో నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో దూసుకెళ్తోంది.  బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఈ ఐదు రోజుల్లో రూ.17.40 కోట్ల వసూలు చేసింది.  ఈ మూవీలో దుల్కర్ సల్మాన్, సముద్ర ఖని, రానా దగ్గబాటి వంటి ఆగ్ర నటులు కీలకపాత్రలో నటించారు. 

ఈ  ' కాంత '  పీరియడ్ డ్రామ సెలవమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.  పాతకాలపు వాతావరణాన్ని అద్భుతంగా చిత్రీకరించిన తీరుకు, నటీనటుల పర్‌ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ సినిమాలో అభిమానులను తీవ్రంగా ఆశ్చర్యపరిచిన సన్నివేశం ఒకటుంది.  అదే, హీరోయిన్ భగ్యశ్రీ బోర్సే, దుల్కర్ సల్మాన్‌ను నిజంగా చెంపదెబ్బలు కొట్టడం. అయితే ఈ సీన్స్ ను  రియల్ ఎక్స్‌ప్రెషన్స్ కోసం చిత్రీకరించారు.

 నిజమైన చెంపదెబ్బలు...

సినిమాలోని కీలకమైన భావోద్వేగ సన్నివేశంలో, భాగ్యశ్రీ బోర్సే (కుమారి పాత్రలో), దుల్కర్ సల్మాన్‌ను ఒకటి కాదు, ఏకంగా అనేకసార్లు కొట్టాల్సి వచ్చింది. ఈ కష్టమైన సీన్ గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు వైరల్‌గా మారాయి. నేను మొదట ఆ సీన్‌ను ఫేక్ చేయాలని అనుకున్నాను. ఎందుకంటే, నేను ఎప్పుడూ ఎవరినీ కొట్టలేదు, అది నాకు చాలా కష్టమనిపించింది. దయచేసి ఫేక్ చేయొచ్చా.. అని కూడా అడిగాను. కానీ హీరో దుల్కర్ సల్మాన్ నిజాయితీగా ఉండే నటనను కోరుకున్నారు. ఆయనకు ఆ దెబ్బ తగిలినప్పుడు వచ్చే సహజమైన ఎక్స్‌ప్రెషన్ రావాలని ఆయన పట్టుబట్టారు. దాంతో నా సహనటుడు కోరుకున్నది చేయక తప్పలేదు అని భాగ్యశ్రీ తెలిపారు. ఆమె ఆ సీన్ చిత్రీకరణ సమయంలో ఎంత ఒత్తిడికి గురయ్యానని చెప్పుకొచ్చారు. 

 'నడిప్పు చక్రవర్తి'కి కృతజ్ఞతలు..

సినిమా విడుదలైన తర్వాత.. భాగ్యశ్రీ బోర్సే తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా ఒక భావోద్వేగ లేఖను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆమె దుల్కర్‌ను "నడిప్పు చక్రవర్తి" అంటూ ప్రశంసించారు.. ఆ పోస్ట్‌లో దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్, నటులు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. 2023, మార్చి 30 తేదీని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ఆ రోజే తను నిజంగా 'కుమారి'గా మారిపోయానని పేర్కొన్నారు.

ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ గురించి రాస్తూ.. "నా ప్రియమైన సహనటుడు దుల్కర్ సల్మాన్, మీరు నిజమైన 'నడిప్పు చక్రవర్తి'. మీతో కలిసి నటించడం ఒక గొప్ప అనుభూతి, మీరు ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా మెరిశారు. నటీనటులందరికీ మీరు నిజమైన స్ఫూర్తి అని ఆకాశానికెత్తేశారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి 'స్పిరిట్ మీడియా', దుల్కర్ సల్మాన్ 'వేఫేరర్ ఫిలిమ్స్' బ్యానర్ల సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించారు. కేవలం నటనకే కాక, నిర్మాణ విలువలకు కూడా పెద్ద పీట వేసిందని  ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలాంటి రియల్ పర్‌ఫార్మెన్స్‌ల వల్లే 'కాంత' సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకుంటోందని  అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.