
అర్జున్ రెడ్డి మూవీ చేసిన వైబ్రేషన్ ఏంటో… ఆ మూవీ తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన కిక్ ఏంటో బాలీవుడ్ ఇపుడు తెల్సుకుంటోంది. విజయ్ దేవరకొండ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో రూపొందిన అర్జున్ రెడ్డి తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా.. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. షాహిద్ కపూర్ హీరోగా అదే మూవీని డైరెక్టర్ సందీప్ రెడ్డి హిందీలో తీస్తున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో టైటిల్ రోల్ కు విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ పక్కాగా సెట్ అయింది. ఆ పాత్రకు మరొకరిని ఊహించుకోవడం కష్టమని అనుకున్నారంతా. షాహిద్ కపూర్ ఈ పాత్రకు సూట్ అవుతాడా… అనే సందేహాలకు టీజర్ చెక్ చెప్పింది. తెలుగు అర్జున్ రెడ్డి… హిందీలో కబీర్ సింగ్ గా రీక్రియేషన్ జరిగిందని టీజర్ ను బట్టి అర్థం అవుతోంది. ఓ సక్సెస్ ఫుల్ ఫార్ములాకు మార్పులు చేయడం కంటే… యాజిటీజ్ గా రీమేక్ చేస్తే చాలు… సక్సెస్ ఇన్ స్టంట్ గా వచ్చినట్టే.
ఒరిజినల్ తీసిన సందీప్ రెడ్డి… రీమేక్ చేస్తున్నాడు కాబట్టి.. ఆ టెంపోను మెయిన్ టెయిన్ చేయగలిగాడు. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండను ఫ్రేమ్ లో ఎలా చూపించాడో.. యాజిటీజ్ గా… షాహిద్ కపూర్ ను అలాగే పాత్రలోకి డైరెక్టర్ దింపేశాడు. ఏ నటుడినైనా పాత్రలో దింపేసినంత మాత్రాన అది పండదు. దానికి యాటిట్యూడ్ సెట్ కావాలి. డైరెక్టర్ సాయంతో షాహిద్ కపూర్ కూడా ఆ మ్యాజిక్ చూపించగలిగాడు. సిగరెట్ తాగుతూ రావడం… మందు తాగడం.. కాలేజీలో ఫైట్.. రొమాన్స్.. ఇలా.. టీజర్ లో చూపించిన ప్రతి ఫ్రేమ్ కూడా అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ ఫ్యాన్స్ కు నచ్చేదే.
గూస్ బంప్స్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: మ్యాజిక్ రిపీట్
తెలుగు అర్జున్ రెడ్డి టీజర్ లాగే యాజిటీజ్ గా ఎడిట్ చేసినట్టు అనిపించినా.. అందులోనూ కొత్తదనం చూపించాడు డైరెక్టర్. షాహిద్ కపూర్ కారణంగానే ఆ ఎట్రాక్షన్ సాధ్యమైంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం టీజర్ వన్ మినిట్ పూర్తయ్యేవరకు హార్ట్ బీట్ పెంచుతుంది. అర్జున్ రెడ్డి ఫ్యాన్స్ ను.. ఈ టీజర్ విత్ బీజీఎం రిపీటెడ్ గా చూసేలా చేస్తుంది. తెలుగులో రాధన్, హర్షవర్ధన్ మ్యూజిక్ అందిస్తే.. హిందీలో అమాన్ మాలిక్ కబీర్ సింగ్ కు సంగీతం అందిస్తున్నాడు.
యూత్ కు అర్జున్ రెడ్డి ఓ ఐకన్. ఆ బీజీఎం చెవుల్లో ఎప్పుడూ మోగే ఓ రింగ్ టోన్. అడల్ట్ కంటెంట్ ఉన్నప్పటికీ… ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇపుడు హిందీలోనూ కబీర్ సింగ్ టీజర్ .. ఓ బజ్ క్రియేట్ చేస్తోంది. సోషల్ ప్లాట్ ఫామ్స్ లో ట్రెండింగ్ లో ఉంది. మూవీ జూన్ 21న విడుదల కానుంది.