కాబూల్ లో రోడ్డు ప్రమాదం..అదుపుతప్పి లారీ బోల్తా..అఫ్గాన్ శరణార్థులు 18 మంది మృతి

కాబూల్ లో రోడ్డు ప్రమాదం..అదుపుతప్పి లారీ బోల్తా..అఫ్గాన్ శరణార్థులు 18 మంది మృతి

కాబూల్: పాకిస్తాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న ఆఫ్ఘన్ శరణార్థుల వాహనం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌‌‌‌లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం ప్రధాన రహదారిపై శరణార్థులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు.

 గాయపడిన వారిని చికిత్స నిమిత్తం నంగర్హర్‌‌‌‌లోని పలు ఆస్పత్రులకు తరలించారు. బాధితుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌‌‌‌, నంగర్హర్ ప్రావిన్స్‌‌‌‌ను అనుసంధానించే ప్రధాన రహదారిపై ఉన్న లఘ్మాన్ ప్రావిన్స్ వద్ద అదుపు తప్పి లారీ బోల్తా పడిందని ప్రాంతీయ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ మాలిక్ నియాజాయ్ వెల్లడించారు. మృతుల్లో పది మంది పిల్లలు, ఐదుగురు మహిళలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ రోడ్డు ప్రమాదంపై తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ విచారం వ్యక్తం చేశారు.