మహబూబ్ నగర్ లో జిల్లా దివిటిపల్లిలో అమర్ రాజా గిగా సెల్ కారిడార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభించారు సీఎం రేవంత్. బుధవారం ( జులై 15 ) జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. పాలమూరు రైతులకు త్వరలోనే శుభవార్త చెబుతామని అన్నారు సీఎం రేవంత్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు 90టీఎంసీల నీటి కేటాయింపు కోసం ప్రయత్నిస్తున్నామని...డిండి ప్రాజెక్టులో 30 టీఎంసీల కేటాయింపు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు సీఎం రేవంత్.
►ALSO READ | చైనాతో పోటీగా తెలంగాణ.. 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం: సీఎం రేవంత్
పాలసీతో తెలంగాణ రైజింగ్ 2047 సాధ్యమని అన్నారు. దేశానికి తెలంగాణ నుంచి 5 శాతం జీడీపీ వెళ్తుందని... 10శాతం జీడీపీ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. రైజింగ్ తెలంగాణ అన్ స్టాపబుల్ అని..చైనా, జపాన్, సౌత్ కొరియా,జర్మనీలతో పోటీ పడాలంటే పరిశ్రమలు పెట్టాలని అన్నారు.2034 నాటికి వన్ ట్రిలియన్ ఎకానమీగా ఎదగడమే తమ లక్ష్యమని అన్నారు.
దేశంలోనే అమర రాజా సంస్థతో పోటీ పడే సంస్థ లేదని.. అమర రాజా సంస్థ చైనా, జపాన్ సంస్థలతో పోటీ పడుతోందని అన్నారు. ఈవీలో చైనా టాప్ అని... అలాంటి దేశంతో పోటీకి అమరారాజ ప్రయత్నిస్తోందని అన్నారు.వర్షాకాలం వచ్చినా ఎల్ నినో వల్ల వర్షాలు రావట్లేదని...దేశాన్ని అభివృద్ధి చేయాలంటే ముందు పొల్యూషన్ తగ్గిచాలని అన్నారు సీఎం రేవంత్. కాలుష్యాన్ని తగ్గించాలంటే ఈవీని ఎంకరేజ్ చేయాలని అన్నారు.
