కొడంగల్, వెలుగు: కొడంగల్లో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ సూచించారు. బుధవారం కడా కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
పనులు నత్తనడకన సాగుతున్నాయని, రోడ్డు విస్తరణ, డ్రైనేజీ, విద్యుత్ లైన్ల మార్పు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సమన్వయంతో పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.
భూగర్భ డ్రైనేజీ పనుల కోసం తవ్విన రోడ్లను అలాగే వదిలేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అంబేద్కర్, వినాయక సర్కిళ్ల విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.
అనంతరం ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై చర్చించారు. సమావేశంలో ఎంపీడీఓ ఉషశ్రీ, తహశీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ బలరాంనాయక్, మార్కెట్ చైర్మన్ అంబయ్య గౌడ్ పాల్గొన్నారు.
