లేహ్​లో అన్న.. కథువాలో తమ్ముడు వీరమరణం

లేహ్​లో అన్న.. కథువాలో తమ్ముడు వీరమరణం
  • ఉత్తరాఖండ్ సైనిక కుటుంబంలో విషాదం

డెహ్రాడూన్: రెండు నెలల వ్యవధిలోనే అన్నదమ్ములు వీర మరణం పొందడంతో ఆర్మీ కుటుంబంలో విషాదం అలుముకుంది. దేశ సేవలో ఇద్దరు బిడ్డలను పోగొట్టుకున్న ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉత్తరాఖండ్​ జిల్లాలోని థాటీదాగర్​ గ్రామానికి చెందిన బల్వత్ సింగ్ నేగి కొడుకు ప్రణయ్​ నేగి (33), తమ్ముడి కొడుకు ఆదర్శ్​ నేగి(27) ఇద్దరూ సైన్యంలో చేరారు.

మేజర్ ప్రణయ్ నేగి లేహ్ లో సరిహద్దు రక్షణ విధుల్లో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న మేజర్ ప్రణయ్ నేగి అమరుడయ్యారు. దీంతో బల్వంత్​ సింగ్​ నేగి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆ బాధ నుంచి ఇంకా తేరుకోకుండానే తాజాగా కథువా జిల్లాలో జరిగిన టెర్రర్ అటాక్ లో బల్వంత్ నేగి తమ్ముడి కొడుకు ఆదర్శ్ నేగి కూడా అమరుడయ్యాడు.