
సెకెండ్ ఇన్నింగ్స్‌లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది కాజల్ అగర్వాల్. ఇప్పటికే కమల్ హాసన్‌కి జంటగా ‘ఇండియన్ 2’లో నటిస్తున్న ఆమె.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా ఫైనల్ అయింది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కాజల్ నటించబోతోందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేసింది టీమ్. అంతేకాదు.. సోమవారం నుండి షూటింగ్‌లో కూడా జాయిన్ అయింది కాజల్ అగర్వాల్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. బాలకృష్ణకు కూతురుగా ఆమె కనిపించనుందని టాక్. బాలయ్య కెరీర్‌లో ఇది 108వ చిత్రం. ఇప్పటికే చాలామంది స్టార్స్‌తో కలిసి నటించిన కాజల్.. బాలకృష్ణకు జంటగా నటించడం ఇదే ఫస్ట్ టైమ్. మరోవైపు కాజల్ లీడ్ రోల్‌లో నటించిన హారర్ కామెడీ మూవీ ‘కోస్టి’ ఉగాది సందర్భంగా బుధవారం విడుదలవుతోంది.