తెలంగాణ వ్యాప్తంగా.. ఘనంగా కాకా జయంతి ఉత్సవాలు..

 తెలంగాణ వ్యాప్తంగా.. ఘనంగా కాకా జయంతి ఉత్సవాలు..

తెలంగాణ వ్యాప్తంగా కేంద్రమాజీ మంత్రి కాకా వెంకటస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాకా వెంకటస్వామి పేరుతో అన్నదానాలు, పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

 మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఘనంగా కాకా వెంకటస్వామి 96వ జయంతి వేడుకలు జరిగాయి.  కాకా జయంతి వేడుకలను పురస్కరించుకొని చెన్నూర్ కొత్త బస్ స్టాండ్ ప్రాంగణంలో కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు  స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాకా అభిమానులు.  బస్ స్టాండ్ ఆవరణలో అన్నదానం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో  స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాకా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

పెద్దపల్లి జిల్లా లో  సుల్తానాబాద్ పట్టణంలోని కాక వెంకటస్వామి విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే విజయ రమణారావు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.మూడు సార్లు ఎంపీ గా కేంద్ర మంత్రిగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పాత్ర పోషించి పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు.  సింగరేణి ఏరియాలో కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి కాక వెంకటస్వామి అని అన్నారు. 

పెద్దపల్లి జిల్లాలో  రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాకా విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకా అభిమానులు. కాకా వెంకటస్వామి సింగరేణి  కార్మికులతో పాటు నిరుపేదలకు చేసిన సేవలను కొనియాడారు.  

పెద్దపల్లి జిల్లా  కలెక్టరేట్ లోకాక వెంకటస్వామి జయంతి వేడుకలు జరిగాయి.  96 వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు  పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ,అదనపు కలెక్టర్ అరుణశ్రీ

పెద్దపల్లి జిల్లా  కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు లయన్స్ క్లబ్ సౌజన్యం తో అల్పాహారం అందించారు కాక వెంకటస్వామి అభిమానులు ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కేంద్రమంత్రిగా పేద ప్రజలకు ఎనలేని సేవలు అందించి హైదరాబాద్ లో 70 వేయిల మంది నిరుపేద కుటుంబలకు గుడిసెలు ఏర్పాటు చేసి పేదరిక నిర్మూలనకు కృషి వ్యక్తి కాక అని కొనియాడారు.  రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన గొప్ప నేతగా ప్రజల గుండెల్లో  చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు కాక అభిమానులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో  రోజువారి కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు కాకా సేవాసమితి సభ్యులు. ఏఎంసి చౌరస్తాలో కాక విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాక వెంకట స్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ లో వివేక్ యువసేన ఆధ్వర్యంలో కాకా వెంకటస్వామి 96 వ జయంతి వేడుకలు జరిగాయి.  కాకా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు   మాజీ ఎంపీపీ మహంకాళి శ్రీనివాస్,క్యాతనపల్లి మాజీ కౌన్సిలర్ పార్వతి విజయ,గాండ్ల సమ్మయ్య,వివేక్ యువ సేన నాయకులు,కాకా అభిమానులు. డప్పు కళాకారులకు,నిరుపేదలకు బట్టలు నిత్య అవసర సరుకులు పంపిణీ చేశారు వివేక్ యువసేన నాయకులు.

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని జువాడి భవన్ లో కాకా జయంతి వేడుకల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి  నివాళులర్పించారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు. సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్య కారకులైన కాకా వెంకటస్వామి పేద ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని జువ్వాడి కృష్ణారావు అన్నారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కాకా జయంతి వేడుకలు జరిగాయి.  దివంగత నేత కాక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు  మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు..

కరీంనగర్ హుజూరాబాద్ లో కాకా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు  కాంగ్రెస్ నేతలు.

నల్గొండ జిల్లా  మిర్యాలగూడలో మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి జయంతి వేడుకలు  ఘనంగా జరిగాయి.  వై జంక్షన్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాల మహానాడు సంఘం నేతలు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాకా వెంకట్ స్వామి  జయంతి వేడుకలు నిర్వహించారు ఆయన అభిమానులు.     కాక చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.