
హసన్ పర్తి,వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు శనివారం బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కాకతీయ వర్సిటీ పరిధిలో జరగాల్సిన లా, బీటెక్, ఎంఎస్సీ 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ (బయోటెక్నాలజీ & కెమిస్ట్రీ), ఎంటెక్, సీఎల్ఐఎస్సీ (దూర విద్య) పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఎగ్జామ్ కంట్రోలర్ రాజేందర్ కట్ల ఒక ప్రకటనలో తెలిపారు.
వాయిదా వేసిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు మిగతా అన్ని పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. వివరాలకు విద్యార్థులు వర్సిటీ వెబ్ సైట్ www.kakatiya.ac.in ను చూడాలని సూచించారు.