‘కాళేశ్వరం’ కేసు విచారణ 22కు వాయిదా

‘కాళేశ్వరం’ కేసు  విచారణ 22కు వాయిదా

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుమతులను సవాల్ చేస్తూ దాఖలైన మధ్యంతర పిటిషన్​పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్ ను విచారిస్తున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జస్టిస్ రఘువేంద్ర ఎస్.రాథోడ్ సెలవులో ఉండటంతో ఈ నెల 22 కు వాయిదా పడింది.  పర్యావరణ అనుమతులు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారని హయాతుద్దీన్ అనే వ్యక్తి గతంలోనే ఎన్జీటీని ఆశ్రయించారు. కేసు విచారణ సమయంలోనే ప్రాజెక్ట్ అనుమతులు వచ్చాయి. అయితే.. పర్మిషన్ ఇవ్వడంలో కేంద్ర పర్యావరణ శాఖ రూల్స్ పాటించలేదని హయాతుద్దీన్ ఎన్జీటీ లో మధ్యంతర పిటిషన్ వేశారు.

 Kaleshwaram Project Case:  The hearing on the petition was postponed to 22