280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

280 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

నకిరేకల్/ మిర్యాలగూడ( వెలుగు) : నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ, శాలిగౌరారం మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు, అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు పట్టుకున్నారు. మిర్యాలగూడ పట్టణంలో నకిలీ విత్తనాలు తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో ఆఫీసర్లు దాడి చేసి ఈదులగూడ చౌరస్తా వద్ద 260 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

అలాగే శాలిగౌరారంలో ఖమ్మంపాటి సోమయ్య అనే వ్యక్తి విత్తనాలు నిల్వ చేసినట్లు ఆఫీసర్లకు సమాచారం అందింది. దీంతో దాడి చేసి తనిఖీలు చేపట్టగా 20 కిలోల విత్తనాలు దొరికాయి. మొత్తం పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని టెస్ట్‌‌‌‌‌‌‌‌ కోసం ల్యాబ్‌‌‌‌‌‌‌‌కు పంపినట్లు నల్గొండ జిల్లా అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ జాయింట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శ్రవణ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.