కామారెడ్డి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సస్పెన్షన్‌‌

కామారెడ్డి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో సస్పెన్షన్‌‌
  •     లైంగిక ఆరోపణల నేపథ్యంలో వేటు వేసిన ఆఫీసర్లు

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌పై సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు పడింది. డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో మహిళా ఆఫీసర్లను లైంగికంగా వేధించడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పలువురు మెడికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు ఇటీవల ఉన్నతాధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌పై దేవునిపల్లి పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఏడు కేసులు నమోదు కాగా, పోలీసులు ఆయనను అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. తర్వాత బెయిల్‌‌‌‌‌‌‌‌పై విడుదల అయ్యారు.

లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు ఉన్నతాధికారులు ఎంక్వైరీ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ను పంపగా ఆయన జిల్లాకు వచ్చి ఫిర్యాదుదారులతో మాట్లాడి వివరాలను తీసుకున్నారు. విచారణాధికారితో  పాటు, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. దీంతో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేయాలని హెల్త్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ క్రిస్టినా ఆదేశాలు ఇవ్వడంతో పబ్లిక్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శనివారం ఆర్డర్స్‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు.

వారం రోజుల్లోనే జిల్లాకు చెందిన ఇద్దరు ఆఫీసర్లు సస్పెండ్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలోనే ఆఫీస్‌‌‌‌‌‌‌‌ సూపరిండెంట్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌ను నాలుగు రోజుల క్రితమే సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేయగా, ఆవే ఆరోపణలపై డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోపై కూడా సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌ వేటు పడడం ఆ శాఖలో కలకలం రేపింది.

జగిత్యాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వోపై ఎస్సీ, ఎస్టీ కేసు

జగిత్యాల టౌన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : జగిత్యాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో పుప్పాల శ్రీధర్‌‌‌‌‌‌‌‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న జూలపల్లి మండలం పెద్దాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన కొప్పుల రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ శుక్రవారం గుండెపోటుతో మరణించారు. అయితే డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో వేధింపులు

కులం పేరుతో దూషించడంతో పాటు మూడు రోజుల పాటు వరుసగా డ్యూటీలు వేయడం వల్ల ఒత్తిడికి గురై రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చనిపోయాడని అతడి సోదరి యశోద పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌వో శ్రీధర్‌‌‌‌‌‌‌‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.