
కాళేశ్వరం వద్ద భద్రత చర్యలపై పోలీస్ బాస్ లు ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్‌ను ప్రారంభించేందుకు ఈ నెల 21న రెండు రాష్ట్రాల గవర్నర్లు, ముగ్గురు సీఎంలు ఇక్కడికి రాబోతున్నారు. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీస్ ఆఫీసర్ల దృష్టంతా కాళేశ్వరంపైనే ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. అటవీ గ్రామాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఓపెనింగ్ రోజు మూడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తులో పాల్గొననున్నారు.
రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాలను పరిశీలించి జిల్లా పోలీస్ యంత్రాంగానికి తగిన సూచనలు ఇస్తున్నారు. మంగళవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రత్యేక హెలీకాప్టర్ లో కాళేశ్వరానికి వచ్చి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసుల ఆధీనంలో నింగి, నేల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కార్యక్రమాలకు ఇంకా మూడు రోజులు ఉండగానే ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో సుమారు 50 కిలోమీటర్ల వరకు నింగి, నేల అంతా పోలీసుల ఆధీనంలో ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని అటవీ గ్రామాలను పోలీసులు ఇప్పటికే జల్లెడ పడుతున్నారు. ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు పెట్టి ప్రతీ వెహికల్ ను తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. అటు మహారాష్ట్ర వైపు కూడా ఇదే తరహాలో చర్యలు తీసుకుంటున్నారు. ఆకాశంలో డ్రోన్ కెమెరాలతో పహారా చేపడుతున్నారు. మావోయిస్టులు లేదా సంఘవిద్రోహ శక్తులు ఆకాశం నుంచి లేదా నేలపై నుంచి ఎలాంటి దాడులు జరపకుండా తగిన ఏర్పాట్లు చేశారు.
మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్ పూర్ మండలం గోదావరి తీర ప్రాంతంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రధాన ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. ఇది ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట. గోదావరి తీరం దాటితే మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రా లు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోనూ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రా ల్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మూడు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ , దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి , తెలంగాణ, మహారాష్ట్ర గవర్నర్లు కే.ఎల్ నరసింహన్, సీహెచ్ .విద్యా సాగర్ రావు శుక్రవారం జరిగే మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్ ఓపెనింగ్ లో పాల్గొనబోతున్నారు.
పర్యాటకులకు పర్మిషన్ లేదు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనిం గ్ నేపథ్యంలో బందోబస్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే పర్యాటకులకు అనుమతి నిరాకరిస్తున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్ హౌజ్ నిర్మా ణాలను చూసేందుకు రోజూ వెయ్యి నుంచి 2 వేల మంది వరకు పర్యాటకులు వస్తుం టారు. వీరందరికీ ప్రభుత్వ ఇంజినీరిం గ్ శాఖ అధికారులే దగ్గరుం డీ మరీ నిర్మాణాలు చూపి, వాటి గురిం చి వివరిం చి పంపిం చేవారు. అయితే ముగ్గురు సీఎంలు, ఇద్దరు గవర్నర్ల పర్యటన నేపథ్యంలో మంగళవారం నుంచి పర్యా టకులకు అనుమతిని రద్దు చేశారు.
అలర్ట్ గా ఉండాలె
కాటారం, వెలుగు : మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతం మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ సరిహద్దులోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నందున అలర్ట్‌గా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీఐజీ మహేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ప్రత్యేక హెలీకాప్టర్ లో ముందుగా మేడిగడ్డ బ్యారేజీ చేరుకున్నారు. పోలీస్ ఆఫీసర్లతో కలిసి మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి వద్ద నిర్మిస్తున్న మేడిగడ్డ పంపు హౌస్ ను పరిశీలించారు. ఇదే టైమ్ లో పోలీసులకు పలు సూచనలు ఇచ్చారు. ఇద్దరు గవర్నర్లు , ముగ్గురు సీఎంలు కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్ కు ఈనెల 21న వస్తున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని చెప్పారు. బ్యారేజీ, పంపు హౌజ్ లలో ప్రాజెక్టు ప్రారంభించే స్థలం, హెలీప్యా డ్, జలహోమం చేసే ప్రదేశాన్ని పరిశీలించా రు. ఐజీ నాగిరెడ్డి , ఎస్పీ ఆర్. స్కరన్, ప్రాజెక్టు ఆఫీసర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సీఎంలు, గవర్నర్లు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన తర్వా త తిరి గి వెళ్లే వరకు కట్టు దిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఆఫీసర్ల సమావేశంలో డీజీపీ ఆదేశించారు. ఐజీలు నవీన్ చంద్, ప్రమోద్ కుమార్, ఎంకే.సింగ్, ఎస్పీలు సంగ్రాంసింగ్, పాటిల్, ఏఎస్పీలు సాయిచైతన్య, శరత్ చంద్రపవార్, ములుగు ఓఎస్డీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.
5వేల మందితో పోలీస్ బందోబస్తు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ రోజైన ఈ నెల 21న మూడు రాష్ట్రాలకు చెందిన సుమారు 5 వేల మంది పోలీసులు బందోబస్తు లో పాల్గొంటారని రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు సూచనప్రాయంగా తెలిపారు. అటవీ గ్రామాల్లో ని ప్రతీరహదారిపై పోలీసులు కాపలా కాస్తారని, ప్రతీ 100 నుంచి 200 మీటర్లకొక పోలీసు ఉంటారని పేర్కొన్నారు. అలాగే మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌజ్ వద్ద గోదావరి అటు, ఇటు వైపు సుమారు 2 వేల మంది వరకు పోలీసులు పహారా కాస్తారని అన్నారు.