ఆరు నెలల్లో కాళేశ్వరంపై రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి

ఆరు నెలల్లో కాళేశ్వరంపై రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి
  • కాళేశ్వరంపై రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో ఆరు నెలల గడువు
  • ఎక్స్‌‌‌‌పర్ట్ కమిటీకి టైమిచ్చిన గ్రీన్ ట్రిబ్యునల్

న్యూఢిల్లీ, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై రిపోర్టు ఇచ్చేందుకు జాయింట్ ఎక్స్ పర్ట్స్ కమిటీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) మరో 6 నెలల గడువు పొడిగించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ హయాతుద్దీన్ తో పాటు కొందరు ఎన్జీటీలో పిటిషన్లు వేశారు. వీటిని విచారించిన ఎన్జీటీ ధర్మాసనం ప్రాజెక్టు  విస్తరణ పనులు నిలిపివేయాలని గతేడాది ఆదేశించింది. ప్రాజెక్టు ఎక్స్ టెన్షన్ లో నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ వేసింది. 6 నెలల్లో రిపోర్ట్ ఇచ్చేలా కేంద్ర పర్యావరణ శాఖకు బాధ్యతలు అప్పగించింది. అయితే ఎన్టీటీ ఇచ్చిన గడువు ముగిసింది. కరోనా వల్ల కమిటీ సభ్యులు పరిశీలనకు వెళ్లలేకపోయారని, మరో 6 నెలల టైమ్ ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ ఎన్జీటీ బెంచ్ ను కోరగా ఎన్జీటీ బెంచ్ గడువు పొడిగించింది.

ఇసుక తవ్వకాల్లో గైడ్ లైన్స్ పాటించాల్సిందే...
ఇసుక తవ్వకాలల్లో  కేంద్ర పర్యావరణ శాఖ గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ స్పష్టం చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నది నుంచి ఇసుక తవ్వకాలు, ఏపీలో ఉచిత ఇసుక సరఫరాపై రేలా స్వచ్ఛంద సంస్థ  వేసిన పిటిషన్ పై జస్టిస్ ఆదర్మ్ కుమార్ గోయల్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ విచారణ జరిపింది. ఇసుక తవ్వకాల్లో జాయింట్ ఎక్స్ పర్ట్స్ కమిటీ సిఫార్సులు, సుప్రీంకోర్టు, ఎన్జీటీ ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని స్పష్టం చేసింది.