బీడీఎస్ స్ట్రే కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

బీడీఎస్ స్ట్రే కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డెంటల్ కాలేజీల్లో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద మిగిలిన బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ వర్సిటీ స్ట్రే వేకెన్సీ ఫేజ్ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆదివారం నుంచి 17వ తేదీ ఉదయం 10 గంటల వరకు tsbdsadm.tsche.in వెబ్​సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. 

ఇప్పటికే అడ్మిషన్ పొందినవారు ఈ కౌన్సెలింగ్​కు అనర్హులని వర్సిటీ తెలిపింది. ఈ విడతలో సీటు పొందాక చేరకపోయినా లేదా కోర్సు మధ్యలో మానేసినా రూ.20 లక్షల జరిమానాతో పాటు మూడేండ్ల పాటు బీడీఎస్ ప్రవేశాల నుంచి డిబార్ చేస్తామని యూనివర్సిటీ స్పష్టం చేసింది. సీటు వచ్చిన వారు యూనివర్సిటీ ఫీజుగా రూ.12,000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.