కాళోజీ వర్సిటీ బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

కాళోజీ వర్సిటీ బీడీఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

ఈనెల 9, 10వ తేదీలలో వెబ్ కౌన్సెలింగ్

వరంగల్ జిల్లా : బీడీఎస్  తొలి విడత ప్రవేశాలకు కాళోజి  హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నెల 9, 10వ తేదీలలో వెబ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. 

 కాళోజీ యూనివర్సిటీ  పరిధిలోని  ప్రభుత్వ,  ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ  చేయనున్నారు. బీడీఎస్ సీట్లకు మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. 

అర్హులైన అభ్యర్థులు ఈనెల 9, 10వ తేదీలలో  ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కాలేజీల వారీగా ఖాళీ సీట్ల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించారు.   

పూర్తి వివరాలను వర్సిటీ వెబ్ సైట్: www.knrush.telangana.in లో చూడొచ్చు.