
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోవ రోజు… కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తున్నారు మలయప్ప స్వామి. దీంతో తిరుమల క్షేత్రం గోవిందనామ స్మరణతో మారుమోగుతోంది. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాళ రాత్రి సర్వభూపాల వాహనంపై దర్శనమివ్వనున్నారు శ్రీవారు.