ఓఆర్ఆర్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం నయా దోపిడీ : కిషన్ రెడ్డి

ఓఆర్ఆర్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం నయా దోపిడీ : కిషన్ రెడ్డి

హైదరాబాద్ చుట్టూ ఉన్న నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ని 30 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఓఆర్ఆర్ లీజు తమ అనుకూలమైన వ్యక్తులకు  కట్టబెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టాలని బీఆర్ఎస్ పార్టీ చూస్తోందని అన్నారు.  బీజేపీ ఆఫీస్ లో ఆయన మాట్లాడుతూ.. హెచ్ఎండీఏకు టోల్ ద్వారా 30 ఏళ్లలో రూ.75 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నారు.  లీజ్ కు ముందే ఏ కంపెనీకి టెండరు రావాలో సీఎం కేసీఆర్ ముందే నిర్ణయించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

నిబంధనలు అతిక్రమించారు...

ఓఆర్ఆర్ పేరుతో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబం నయా కుంభకోణానికి పాల్పడుతోందని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని చెప్పే బీఆర్ఎస్ ఓఆర్ఆర్ ను ఎందుకు లీజ్ కు ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్ హెచ్ ఏఐ నిబంధనల ప్రకారమే లీజు ప్రక్రియ జరిగిందని బీఆర్ఎస్ చెప్పడం అవాస్తవమని అన్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యను బట్టి లీజు పరిమితిని తగ్గించుకోవచ్చని నిబంధనల్లో ఉందని, కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదన్నారు.