భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్

భూ కబ్జా కేసులో కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్

బీఆర్ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్​ కన్నారావు అరెస్టు అయ్యాడు. మన్నే గుడలో భూకబ్జా కేసులో మంగళవారం ఆదిభట్ల పోలీసులు కన్నారావును అరెస్టు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కావాలని కన్నారావు వేసిన పిటిషన్ ని హైకోర్టు రిజెక్ట్ చేసింది. రెండు సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేసిన కన్న రావుకు హైకోర్టు షాకివ్వడంతో అరెస్టు తప్పలేదు. మన్నే గుడలో భూ కబ్జాకు యత్నించిన కన్నా రావుతో పాటు మరో 38 మందిపై 147,148,447,427,307,436,506,r/w149 IPC కేసులు నమోదు చేశారు పోలీసులు.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడలో సర్వే నెంబర్ 32/ఆర్​యూయూ లో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్స్​ సంస్థకు చెందిన రెండు ఎకరాల ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు కల్వకుంట్ల కన్నా రావు గ్యాంగ్ ప్రయత్నించిందని సంస్థ డైరెక్టర్ బండోజు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​నమోదు చేశారు. కన్నారావు మార్చి 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు, జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్ లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ ను కూల్చివేశారని ఫిర్యాదులో బండోజు శ్రీనివాస్​తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.