
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ సైరా షూటింగ్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ నేను సైరా నరసింహారెడ్డిని కలిశాము. ఎన్నో విషయాలు చర్చించుకున్నాం. చిరంజీవి జీవితం తమకు ఎంతో స్పూర్తినిచ్చింది. ఆయనకు గొప్ప విజయం దక్కాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇలాంటి సమావేశాలు మరెన్నో జరగాలని కోరుకుంటున్న‘ అని అన్నారు.