అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాం

అభిమానులకు జీవితాంతం రుణపడి ఉంటాం

ఇంతకంటే బెటర్ గా బింబిసార-2 ప్రేక్షకుల ముందుకు వస్తది అని నందమూరి కళ్యాణ్ రామ్ అన్నాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం బింబిసార. వశిష్ఠ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ మూవీ ఇవాళ విడుదలై ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ లో పాల్గొంది.

ఈ సందర్భంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. "మా సినిమా విజయం అందించిన ప్రతి ప్రేక్షకుడికి ధన్యవాదాలు తెలిపాడు. నందమూరి అభిమానులకి, సినీ ప్రేక్షకులకు జీవితాంతం రుణపడి ఉంటాం అన్నాడు. మంచి కంటెంట్ ఉన్న మూవీకి ఆదరణ ఉంటుందని అర్థం అయింది. సినిమాకి లైఫ్ ఇచ్చిన కీరవాణికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఈ సినిమా చూసి నాకు సపోర్ట్ అందించిన నా తమ్ముడికి (జూ.ఎన్టీఆర్) లవ్ యూ అన్నాడు. ఇంతకంటే బెటర్ గా బింబిసార-2 ప్రేక్షకుల ముందుకు వస్తది" అని తెలిపాడు.