కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్‌‌కు రక్షణ శాఖ కాంట్రాక్ట్

కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్‌‌కు రక్షణ శాఖ కాంట్రాక్ట్

హైదరాబాద్​, వెలుగు:భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ (కేఎస్​ఎస్​ఎల్​)కు భారత రక్షణ శాఖ రూ. 250 కోట్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చింది. 

 2026 నవంబర్ నాటికి అండర్ ​వాటర్​ సిస్టమ్స్​ను సరఫరా చేయాలి. కేఎస్​ఎస్​ఎల్​ గత ఐదు సంవత్సరాలుగా మానవ రహిత సముద్ర వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తిలో సామర్థ్యాలను పెంచుకుంది. భారత నౌకాదళంలో కేఎస్​ఎస్​ఎల్​ సరఫరా చేసిన అన్​మ్యాన్డ్​మెరైన్​ సిస్టమ్స్ సేవలు అందిస్తున్నాయి.