కామధేను ప్రొడక్షన్​ కెపాసిటీ పెంపు

కామధేను ప్రొడక్షన్​ కెపాసిటీ పెంపు

హైదరాబాద్, వెలుగు:  టీఎమ్‌‌టీ బార్ల తయారీ సంస్థ కామధేను లిమిటెడ్ ప్రొడక్షన్​ కెపాసిటీని పెంచుతునట్టు ప్రకటించింది.  గత ఏడాది కాలంలో తెలంగాణలో తన ప్రీమియం బ్రాండెడ్ టీఎమ్‌‌టీ బార్ కామధేను ఎన్ఎక్స్‌‌టీకి విపరీతమైన డిమాండ్ వచ్చినట్టు ప్రకటించింది.

 ఇన్‌‌ఫ్రా  స్టీల్‌‌కి పెరుగుతున్న డిమాండ్‌‌ను తీర్చడానికి వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రొడక్షన్​కెపాసిటీని 40 వేల ఎంటీలకు పెంచుతామని  కామధేను లిమిటెడ్ డైరెక్టర్ సునీల్ అగర్వాల్ వెల్లడించారు.  చానెల్ పార్టనర్ నెట్‌‌వర్క్​లోని డీలర్ల సంఖ్య 400 నుంచి 450కి పెరిగిందని తెలిపారు.