
అందాల రాశి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) మణిరత్నం (Mani Ratnam) సినిమాలో నటించబోతోందని తెలుస్తోంది. కమల్ హాసన్ (Kamal Haasan) లెజెండ్రీ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తో సినిమాను చేసేందుకు కమిట్ అయ్యారు. ఇందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్టయ్యింది. కమల్ 234వ చిత్రంగా థగ్ లైఫ్(Thug Life) అనే సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాలో త్రిష మరియు నయనతార హీరోయిన్స్ అనే వార్తలు వచ్చాయి.
లేటెస్ట్ గా ఈ సినిమా కోసం దర్శకుడు మణిరత్నం బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ ని సంప్రదించారని తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ ఈ సినిమా లో నటించేందుకు కథ విన్న వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. థగ్ లైఫ్ సినిమా లో భాగం అయ్యేందుకు ఐశ్వర్య రాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తమిళ మీడియా వర్గాల్లో కథనాలు వస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో ఐశ్వర్య రాయ్ హిందీలో వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే సౌత్ లో పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించిన విషయం తెల్సిందే. మళ్లీ ఇప్పుడు ఐశ్వర్యరాయ్ తమిళ్ మూవీ థగ్ లైఫ్ లో నటించేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో మరో సినిమా రాబోతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్, హీరో ఉదయ్ నిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది.