
తమిళ స్టార్ కమల్ హాసన్(Kamal Haasan) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మామ పుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు ఆరుయిర్ శ్రీనివాసన్(Aruir Srinivasan) కన్నుమూశారు. 92 ఏళ్ళ వయసుగల శ్రీనివాసన్ ఏప్రిల్ 22న కొడైకెనాల్‌లో తుదిశ్వాస విడిచారు. దీంతో కమల్ హాసన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. రమకుడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్ ఒకప్పుడు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. అంతేకాదు.. చాలా విషయాల్లో కమల్ హాసన్ కు వెన్నుదన్నుగా నిలిచారు శ్రీనివాసన్.
எனது ஆளுமை உருவாக்கத்தில் பெரும்பங்கு வகித்த ஆருயிர் மாமா சீனிவாசன் இன்று தன்னுடைய 92-வது வயதில் கொடைக்கானலில் காலமானார். புரட்சிகரமான சிந்தனைகளுக்காகவும், துணிச்சலான செயல்களுக்காகவும் உறவினர்கள் நண்பர்கள் மத்தியில் ஒரு வீரயுக நாயகனாக திகழ்ந்தவர் வாசு மாமா.
— Kamal Haasan (@ikamalhaasan) April 22, 2024
இறுதி மரியாதை… pic.twitter.com/7CxY6XeWYs
ఇక మామ ఆరుయిర్ శ్రీనివాసన్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా స్పందించారు.. నా వ్యక్తిత్వ వికాసానికి మామ ఆరుయిర్ శ్రీనివాసన్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన విప్లవాత్మక ఆలోచనలు, ధైర్య సాహసాల విషయంలో వీరోచితమైన వ్యక్తి. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకువచ్చారు. రేపు (23-04-24) ఉదయం 10:30 గంటలకు బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో దహన సంస్కారాలు జరుగుతాయి.. అని రాసుకొచ్చారు కమల్.