
భారతదేశం నుంచి ఆటో రంగం ఎగుమతులు ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలకు వెళుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాలకు మేడిన్ ఇండియా కార్లు, టూవీలర్ల షిప్పింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటో ట్రాన్స్‌షిప్‌మెంట్ అవసరాల కోసం ప్రత్యేకంగా చరిత్రలో తొలిసారిగా ఒక పోర్టు అందుబాటులోకి రావటం భారతదేశానికి కొత్త అవకాశాలను అందిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది తమిళనాడులోని కామరాజర్ పోర్ట్ గురించే. ఆటోమొబైల్స్ ట్రాన్స్‌షిప్‌మెంట్‌ను చేపట్టిన తొలి భారత పోర్టుగా ఇది అవతరించింది. ఈ పోర్టు వాహన లాజిస్టిక్స్ కోసం కొత్త మార్గాలను రూపొందిస్తోంది. కామరాజర్ పోర్టు నుంచి ఆగస్టు 28న ఇక్కడ మెుదటి ఆటోమొబైల్ ట్రాన్స్‌షిప్‌మెంట్ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తయింది. ఇందులో సింగపూర్ నుంచి వచ్చిన 500 వాహనాలను GCB ట్రాన్సిట్ యార్డ్‌కు పంపే ముందు కార్ క్యారియర్ MV టూర్మాలిన్ ఏస్‌లో పోర్ట్‌లోని జనరల్ కార్గో బెర్త్‌లో దించారు.
దీంతో కామరాజర్ పోర్టు హ్యూహాత్మకంగా భారత ఆటోమొబైల్ ట్రాన్స్‌షిప్‌మెంట్ హబ్‌గా మారింది. రానున్న నెలల్లో ఇలాంటి మరిన్ని ట్రాన్స్‌షిప్‌మెంట్ కన్సైన్మెంట్‌లను ఈ పోర్టు నుంచి నిర్వహించటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కొంత కష్టతరమైన ఇలాంటి ఆపరేషన్స్ ను కామరాజర్ పోర్టు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించటం భారతదేశ లాజిస్టిక్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ రంగంలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.